Our Story
వర్తూరు తెలుగు సంఘం మొదటి సంవత్సరం ప్రయాణం.
వర్తూరు తెలుగు సంఘం మూడు అక్టోబర్ 2022 ( శ్రీ శోభకృత్ నామ సంవత్సరము , దక్షిణాయనం, శరదృతువు , ఆశ్వీయుజ మాసం, శుద్ధ అష్టమి , పూర్వాషాడ నక్షత్రం) దుర్గాష్టమి పర్వదినము రోజున పద్మశ్రీ శ్రీ గరికిపాటి నరసింహారావు గారిచే ప్రారంభమై, దేవదేవుడి అనుగ్రహం , తెలుగు వారు మరియు పుర ప్రముఖుల సహాయ సహకారాలు , కార్య నిర్వహణ సభ్యుల కృషితో దినదిన అభివృద్ధి చెంది ఎన్నో కార్యక్రమాలు విజయవంతంగా జరుపుకున్నము. సంఘం ప్రారంభము అయిన తరువాత మనము చేపట్టిన కార్యక్రమము వివరాలు
1)సంఘం ఆవిర్భావ సందర్భంగా garikipaati వారి ప్రసంగం, సాంస్కృతిక కార్యక్రమాలు, రాత్రి భోజనం, వేమన & సుమతి పుస్తకాలు ವಿತರಣ అన్నీ ఉచితంగా చేయడం జరిగింది.
2)నవంబర్ 1 2022, హైదరాబాద్ నుంచి కాళీ నడకన శబరిమల వెళుతున్న భక్తుల బృందంతో సాయంకాలం పడి పూజ , భిక్ష ఏర్పాటు ఉచితంగా చేయడం జరిగింది
3) కార్తీక మాసం సందర్భము గా వనభోజనాలు, తోటలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతము, ధూళిపాళ వారి హరికథా సంకీర్తనలు. వ్రతానికి కావాల్సిన వస్తువులు, భోజనం కర్చు సభ్యులు కట్టారు. మిగతా కర్చు సంఘం భరించ్చింది .
4) సంక్రాంతి సంబరాలు. ఆ నాటి ఆటలు ఆది సభ్యులు గత స్మృతులతో ఆనందించారు. సాయంత్రము ఉపహారము ఏర్పటు చేయటము జరిగినది. అన్నీ ఉచితంగా యేర్పాటు జరిగింది.
5) ఉగాది – వర్తూరు శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి దేవస్థానంలో పంచాంగ శ్రవణము ఏర్పటు చేసాము. ఉగాది పచ్చడి, ప్రసాదం ఉచితంగా యేర్పాటు జరిగింది.
6) ఉచితంగా శ్రీ వెంకటరమణ & co వారి తెలుగు క్యాలండర్ ವಿತರಣ జరిగింది.
7) వరాహ జయంతి సందర్బంగా సింహాచల దేవస్థానం వారి అద్వర్యం లో స్వామి వారి కల్యాణం గుంజూరు అక్షత ప్యాలెస్ లో జరిపించటం జరిగింది. యేర్పాట్లు ఉచితం.
8) శ్రీ గరికిపాటి నరసింహారావు గారి “సాగర ఘోష” కన్నడ అనువాద పుస్తక ఆవిష్కరణ సభ ఏర్పాటు.
9) VTS office లో తెలుగు సాహిత్యం పుస్తకాలు సభ్యులకు అందుబాటులో వుంచాము.
10) పైన చెప్పిన కార్యక్రమాలు కాకుండా TB రోగులకు ఉచితంగా పోషక ఆహార వస్తువులు VTS groups సభ్యుల సహకారంతో అందించాము.
11) ఉచిత ఆరోగ్య క్యాంప్ యేర్పాటు చేశాము.
12) groups లో వున్న సభ్యులకు ఉపయోగం కొరకు లోకల్ బిజినెస్ సమాచారం చేరవేసి, సంఘంకి ఆర్థిక వనరులు సమకూర్చుకునే ఉద్దేశంతో paid advertisement మొదలు పెట్టాము.
ఇట్లు
VTS కార్యనిర్వాహక సభ్యులు






Become a Member
Joining the Varthur Telugu Sangham is your gateway to becoming an integral part of our close-knit Telugu family. As a member, you’ll enjoy exclusive access to a world of cultural experiences, and social connections. Our vibrant community is more than just an organization; it’s a family that celebrates unity and togetherness.


No posts found!
No posts found!